Saturday, August 23, 2025
E-PAPER
spot_img

రణరంగం!

- Advertisement -

ఇరు దేశాల యుద్ధం
భీకరమైన వాతావరణం
బిక్కుబిక్కుమంటూ జీవనం
ఆర్థిక స్థితిగతుల్లో వ్యత్యాసం
పతనమౌతున్న వాణిజ్యం
ఈ రణరంగంలో
విచ్ఛిన్నమైపోతున్న వనరులు
విస్పోటన శకలాల మధ్య దేహాలు

పొగతో కమ్ముకుపోయిన ప్రాంతాలు
సెగతో కమిలిపోతున్న దేహాలు
ఏవైపు నుంచి ఏది దూసుకొస్తుందో
అరచేతిలో పెట్టుకుంటున్న ప్రాణాలు
బూడిద మధ్యలో ఇరుక్కుపోయి
తునాతునకలైన కట్టడాలు
దిగ్భంధంలో రహదారులు
యుద్ధం మహా ప్రళయమైనప్పుడు
దేశం దిశను కోల్పోతోంది
అభాగ్యుల ఆర్తనాదాలు కూడా
క్షిపణి శబ్ధాల్లో కలిసిపోతుంటే
ఊపిరి సలుపని జీవితాలు
ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రాంతాలు
శాంతి తోక ముడిచి పరుగులెట్టింది
ఆవేశం అగ్నికీలలై ఎగజిమ్ముతోంది
జయపజయాల నడుమన
సగటు బతుకు ఒంటరిదైపోతోంది
కోపాగ్ని కోరల మధ్యలో జనం
నలిగిపోయే తీరు పడగలిప్పింది
హోరాహోరి పోరులో
సామరస్యం వెనకడుగు వేసింది
సమతుల్యత సమసిపోయింది
అక్కడ ఇప్పుడు యుద్ధం
జడలు విప్పి కరాళ నృత్యం చేస్తోంది
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad