నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల, “గ్రామ స్వరాజ్యంస్వచ్ఛంద సంస్థ” ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని బీబీపేట మండల సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ నేర్పించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఇదే సందర్భంలో సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యతను మహిళలకు వివరించారు. ఆర్టిఐ చట్టం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాలను చేతిలోకి తీసుకోరాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహిళా చట్టాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ మండల కార్యదర్శి పండ్ల హనుమంతు. నిర్వాహకురాలు వాని, శిక్షణ పొందుతున్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా కుట్టు మిషన్ సెంటర్ను సందర్శించిన బిబిపేట మండల ఆర్టిఐ కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



