సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మిర్యాలగూడ
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న చేపట్టిన తెలంగాణ బందును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు కోరారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏ రామలింగం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్పించాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం బిజెపిని గద్దదింపాలని వారన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బిల్లా కనకయ్య గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, గోగుల యాదగిరి మహిళా సమైక్య నాయకురాలు ఎర్రబోతు పద్మ, డి శాంత, బంటు రాజేశ్వరి, ఎస్కే షమీం, జి రమేష్, భాస్కర్ల, పరమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.
18న బీసీ బందును జయప్రదం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES