- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
అమరచింత మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని అన్నారు. బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285A ను సవరించి అసెంబ్లీ మండలిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేస్తూ బిల్లు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, బీసీ సెల్ మండల అధ్యక్షులు విష్ణు ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ప్రకాశం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -