Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలి

పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలి

- Advertisement -

యాదవ సంఘం ఉపాధ్యక్షుడు రాగం ఐలన్న యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

పార్లమెంట్ సమావేశాల్లో 42 శాతం బీసీ బిల్లును ప్రవేశపెట్టి,ఆమోదించాలని అఖిల భారత యాదవ మహాసభ మండల ఉపాధ్యక్షుడు రాగం ఐలయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వాలు ఇప్పటివరకు బీసీలను ఓటు కోసం వాడుకుంటూ, బానిసలుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 34 శాతాన్ని 23 తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి బీసీ కుల గణన చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో 42 శాతం బీసీ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించారని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల 43శాతం అమలకు చట్టసభలో కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి కేంద్రం పార్లమెంట్లో బీసీ బిల్లు వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img