– మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ స్థాయి టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు పతకాలు సాధించటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి సైదులు హర్షం వ్యక్తం చేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. జాతీయ స్థాయిలో జరిగిన టి స్కాన్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించారు. యాచ్‌క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఓపెన్ రెగట్టా అప్టిమిస్ట్ మెయిన్ ప్లీట్ విభాగంలో చాంద్రాయణగుట్ట బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జె శిరీష వెండి పతకం సాధించగా, మునుగోడు బాలుర పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న వి హనుమంతు కాంస్య పతకం సాధించాడు. కల్వకుర్తి బాలికల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఎ అక్షర జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. బీసీ గురుకుల విద్యార్థులకు చదువుతో పాటు వారిలో నైపుణ్యాలను, ఆసక్తిని గమనించి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బీసీ గురుకుల విద్యాసంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని వివరించారు. ఇందులో భాగంగా బీసీ గురుకుల విద్యార్థులకు యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్‌లో శిక్షణ ఇస్తున్నామని సైదులు తెలిపారు.
రెగట్టా పోటీల్లో బీసీ గురుకుల విద్యార్థులకు పతకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES