Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమేడిపల్లి ఎస్సీ రిజర్వేషన్ లో బీసీ సర్పంచ్ గెలుపు 

మేడిపల్లి ఎస్సీ రిజర్వేషన్ లో బీసీ సర్పంచ్ గెలుపు 

- Advertisement -

– సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారిన వైనం 
– పలు శాఖల అధికారులకు ఫిర్యాదు
– కోర్టును ఆశ్రయించిన ఆలంపల్లి లావణ్య 
– ఈ అంశంపై మేడిపల్లి నక్కర్త లో తీవ్ర దుమారం
నవతెలంగాణ – యాచారం : 
యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానం వివాస్పదంగా మారింది. గ్రామంలో సర్పంచ్ గెలుపుపై తీవ్ర దుమారం రేపుతుంది. ప్రస్తుతం గెలిచిన సర్పంచి ఎన్నికను అధికారులు రద్దు చేస్తారా లేక కొనసాగిస్తారా అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ను మోసం చేసి ముచ్చర్ల సుగుణ సర్పంచిగా గెలిచారని ఆలంపల్లి లావణ్య ఇబ్రహీంపట్నం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కలెక్టర్, ఆర్డీవో,  తాసిల్దార్ లకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం కోర్టును అలంపల్లి లావణ్య ఆశ్రయించారు. సర్పంచిగా గెలిచిన ఎరుకలి సుగుణ గౌడ బిసి కులానికి చెందిన వారిని, ఆమె తండ్రి సత్యనారాయణ తండ్రి జంగయ్య, తల్లి లక్ష్మమ్మలు గౌడ కులానికి వారని తెలిపారు.

ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముచ్చర్ల సంపత్ ను ప్రేమ వివాహం చేసుకుందని అన్నారు. సుగుణ కులాంతర వివాహం అనంతరం ఆమె తల్లిదండ్రులు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లారనీ గుర్తు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో మేడిపల్లికి ఎస్సీ మహిళా రిజర్వుడు అయింది. దీంతో ముచ్చర్ల సంపత్ మండల రెవెన్యూ కార్యాలయంలో తప్పుడు పత్రాలు సృష్టించి తాసిల్దార్, ఆర్ఐ లను మోసం చేసి ఎరుకలి సుగుణ ఎస్సీ కుల ధ్రువపత్రాన్ని పొందారని ఆరోపించారు. ఈ అంశంపై గ్రామంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విమర్శించారు. అంతేకాకుండా ఎన్నికల ఆర్వో సుగుణ నామినేషన్ ను తిరస్కరణకు గురైందని, ఆమె పేరును తిరస్కరణ జాబితాలో పెట్టకుండా ఎన్నికల అధికారి నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ పత్రాన్ని తిరస్కరించకుండా సర్పంచు అభ్యర్థుల పోటీ జాబితాలో ఉంచారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన సుగుణ సర్పంచ్ గెలుపును రద్దు చేయాలని ఆలంపల్లి లావణ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చిన తాసిల్దార్, ఆర్ఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మేడిపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కమిషన్ ను మోసం చేసి గెలిచిన  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎన్నికల ఉన్నతాధికారులు స్పందించి సుగుణ ఎన్నికను రద్దుచేసి తనను సర్పంచిగా ప్రకటించాలని లావణ్య కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -