- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పేలుడుతో పౌర విమానయాన భద్రతా సంస్థ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. ప్రత్యేక మార్గనిర్దేశకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. ఎయిర్‌పోర్టులు, పైలట్ శిక్షణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విమానాశ్రయాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రయాణికులను, లగేజీని మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరింది. విమానాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలంది.
- Advertisement -



