Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల చైతన్యం నందిపేట నుంచే మొదలు

బీసీల చైతన్యం నందిపేట నుంచే మొదలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బోధన్ తర్వాత నందిపేట మండలంలోనే దీక్షలు ఎక్కువ రోజులు కొనసాగినాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో నిన్న బోధన్ డివిజన్లో 60% పైగా బీసీలు గెలిచారు. అదే బోధన్ ను ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్ డివిజన్లో కూడా జనరల్ స్థానంలో నిలబడ్డ ప్రతి ఒక్క బీసీ బిడ్డను గెలిపించాలని ఆర్మూర్ డివిజన్ ప్రజలను ముఖ్యంగా నందిపేట మండల ప్రజలకు విన్నపం చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. శనివారంబీసీ జేఏసీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ..ఆర్మూర్ డివిజన్ బీసీ బిడ్డలు అందరూ ఏకమై బిసి అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని  పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తోపాటు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్  పాల్గొన్నారు.

ఇదే ఐకమత్యం కొనసాగితే భవిష్యత్తులో బీసీలు అదే రాజ్యాధికారం జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాల దుర్హంకారులకు బుద్ధి చెప్పాలంటే బీసీ కులస్తులందరూ కూడా ఏకమై కులాలకు అతీతంగా గెలిచే బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచులుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ అన్నారు.  మనమందరము ఏకమైతే దాదాపు 70% పంచాయతీలను వశం చేసుకోవచ్చని అన్నారు. అది బోధన్ డివిజన్ ఎన్నికలతో నిరూపితమైందని అన్నారు. దాదాపు 60 శాతం గ్రామపంచాయతీలను బీసీలు కైవసం చేసుకోవడం శుభసూచకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగా కిషన్ అన్నారు.మనం సింహభాగం పంచాయతీలను గెలుచుకుంటే అప్పుడు బీసీ ద్రోహులకు గుణపాఠం చెప్పిన వాళ్లమవుతామని అన్నారు.

మనం ఎక్కువ గ్రామపంచాయతీలు గెలుచుకుంటే అప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుచుకొని మనకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు దామాషా ప్రకారం ఇస్తాయని అన్నారు. భవిష్యత్తులో మనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మన ప్రభావం చూపాలి కాబట్టి సెంటిమెంట్లకు, ఆర్థిక బలానికి, ఎమోషన్స్ మనోభావాలకు, ప్రలోభాలకు లొంగకుండా మన బీసీ జాతి కొరకు ఏకం కావాలని నందిపేట మండల బిసి సంక్షేమ సంఘం నాయకులు దారం సురేష్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్, పోల్కం గంగ కిషన్, దారం సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -