Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష  పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి 

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష  పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి 

- Advertisement -

– బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 
: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని  బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అగ్రవర్ణాలకే  సముచిత స్థానం కల్పిస్తూ బీసీలను అణచివేస్తున్నారని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అగ్రవర్ణ పాలన నడుస్తుంది తప్పా బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేయడం లేదన్నారు.

బీసీలను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్న ప్రభుత్వం అధ్యక్ష పదవుల లో అయినా బీసీలకు సముచిత స్థానం కల్పించకపోతే స్థానిక ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెపుతారన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే గేలవాలన్నా బీసీల ఓట్లే అతి కీలకం అన్న విషయం కాంగ్రెస్ పార్టీ  గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగిడి జీడియా యాదవ్, పోలగాని వెంకటేష్ గౌడ్, జక్కా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి గంగాధర్, నరేష్, శంకర్, మహేందర్, సాయి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -