- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా చేపట్టనున్నారు. ‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు . సమితి నేతలు, ఏఐబీసీఎఫ్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్‌తో పాటు పలువురు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
- Advertisement -