Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అప్రమత్తతే...సురక్షితం.!

అప్రమత్తతే…సురక్షితం.!

- Advertisement -

-గ్యాస్ సిలిండర్ తో జర భద్రం
నవతెలంగాణ-మల్హర్ రావు
వంటగ్యాస్ జీవ నంలో ముఖ్యమైంది. కానీ నిర్లక్ష్యం చేస్తే అదే ప్రాణాంతకంగా మారుతుంది.గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.సిలిండర్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొన్ని చోట్ల ఆస్తినష్టం జరుగుతుంది.ఈ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఆధి కారులు హెచ్చరిస్తున్నారు.

-అవగాహన కల్పించాలి..
వంటగ్యాస్ సిలిండర్ వినియోగంలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ వాడకంపై వినియోగదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

-జాగ్రత్తలు పాటించాలి
పలు సూచనలు పాటిస్తే గ్యాస్ ప్రమాదాలను నివారించవచ్చుని నిపుణులు చెబుతున్నారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న పైపులు, రెగ్యులేటర్లు, స్టవ్లు మాత్రమే వాడాలి.పైపును తరచుగా పరిశీలించి పగుళ్లు గమనిస్తే వెంటనే కొత్త పైపు వేసుకోవాలి.వంట పూర్తయిన తర్వాత స్టవ్, రెగ్యూలేటర్ రెండూ ఆఫ్ చేయాలి.గ్యాస్ వాసన వస్తే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి గాలి బయటకు వెళ్లేలా చూడాలి.ఇంట్లో రెండు సిలిండర్లు ఉంటే పక్కపక్కన ఉంచకుండా దూరంగా పెట్టాలి.గ్యాస్ సిలిండర్లో మంటలు వస్తే వెంటనే తడి దుప్పటి సిలిండర్ పై కప్పితే మంటలు అదుపులోకి వస్తాయి.సిలిండర్ ను నేరుగా సూర్యకాంతి తగిలే ప్రదేశంలో లేదా వేడి ప్రదేశంలో ఉంచవద్దు.ఎప్పుడూ నిటారుగా ఉంచాలి.

-ఇవి చేయొద్దు..
ఏళ్ల తరబడి ఒకే పైపు, రెగ్యులేటర్ వాడరాదు.గ్యాస్ లీకై వాసన వచ్చినప్పుడు ఇంట్లోని లైట్లు,లేదా ఇతర ఎలక్ట్రిక్ ఉపక రణాలను ఆన్, ఆఫ్ చేయడం ప్రమాద కరం.గ్యాస్ వాసన వచ్చిన వెంటనే ఇంట్లోని అన్ని తలుపులు, కిటికీలు తెరవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -