Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాలను చాకచక్యంగా నివారించవచ్చుని అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ శివాజీ అన్నారు.బుధవారం చౌటుప్పల్ పట్టణంలోని ప్రతిభ ఒకేషనల్,శ్రీ మేధా జూనియర్ కళాశాలలో అగ్నిమాపక అధికారులు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,వాటి నివారణ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  అగ్ని మాపక నివారణ చర్యలు,అనుసరించవలసిన చర్యలు, ఫైర్ సర్వీస్ సిబ్బంది విద్యార్థులకు డెమో ద్వారా అవగాహన కల్పించారు. ప్రజలు ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి ప్రిన్సిపాల్ సిలివేరు శ్రీనివాస్,పాండు జమిందార్,వాంకుడోతు భాగ్య నాయక్,నరేష్, నరసింహ, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -