ఎంపిడిఓ అడ్డురి బాపు
నవతెలంగాణ – మల్హర్ రావు.
వర్షాకాలంలో రాబోయో వరదలు,సీజనల్ వ్యాదులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాటారం మండల ఎంపిడిఓ అడ్డురి బాపు సూచించారు.భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి వివిధ శాఖల అధికారులు,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు రాబోయే రోజుల్లో వర్షాల వలన వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి,సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.అలాగే గ్రామాల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకెజీలు అరికట్టుట,వాటర్ ట్యాంక్ లు పరిశుభ్రం చేపించుట,గేట్ వాల్వ్ లు మరమ్మతులు చేపించుట తదితర అంశాలపై చర్చించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు,ఆర్ డబ్ల్యూ ఏఈ, మెడికల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ,హౌసింగ్,పిఆర్ ఏఈలు,ఎంపిఓ,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
వరదలు,సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES