Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవికుమార్ నాయక్..
నవతెలంగాణ – వెల్దండ
వైద్య సిబ్బంది వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆరోగ్య శాఖ వైద్యాధికారి రవికుమార్ నాయక్ అన్నారు. గురువారం వెల్దండ ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం కావడంతో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వ్యాధులను వరి చేరకుండా చేయాలని సూచించారు. ప్రధానంగా గ్రామాలలో నీటిమడుగులు లేకుండా ఉండేలా వైద్య సిబ్బంది ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

దోమల గారి తెలియకుంటే రోగాలు దరిచేరవని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వచ్చిన జబ్బులను పరీక్షలు చేసుకుని మందులు తీసుకుని జాగ్రత్తలు పడాలని సూచించారు. అన్ని రకాల పరీక్షలతోపాటు అన్ని రకాల మందులు ప్రభుత్వాసుపత్రులలో ఉన్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, పర్యవేక్షణ అధికారి మురళి, ఫార్మసీ ఆఫీసర్ అనిత , ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, యుడిసి శోభా, ఒపి ఏ.ఎన్.ఏం. సూర్యకళ, ఆరోగ్య సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad