Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి: అడిషనల్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బొప్పారం, గుడూరు గ్రామాలలో అడిషనల్ కలెక్టర్  విజయలక్ష్మి పర్యటించారు. డెంగ్యూ కేసు పాజిటివ్ రావడంతో రెండు రోజుల క్రితం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. గ్రామంలో సానిటేషన్ డ్రై డే చేయడం జరిగినది. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి  మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  ఇన్చార్జి  అధికారిని  డాక్టర్ శ్రీదేవి, స్థానిక  వైద్యాధికారిణి  డాక్టర్ మౌనిక  గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు.

వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  తెలియజేశారు. పరిసరాల పరిశుభ్రత గురించి  ఇంటి పరిసరాల పరిశుభ్రత గురించి సానిటేషన్ గురించి ప్రజలకు  అవగాహన కల్పించారు. గ్రామంలో జిల్లా ఎపిడమిక్ టీం సభ్యులు మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ టి.రమేష్ కుమార్, తలకోటి పరమేశ్వర్, కాపర్తి రాజు, ఊరుకొండ గోపి, కె సతీష్ సభ్యులు గ్రామంలో పర్యటించి డ్రైడే నిర్వహించారు.  దోమల మందు పిచికారి చేయించారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారి తో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్ పద్మావతి, మహిళా హెల్త్ అసిస్టెంట్ సుజాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -