Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు అన్నారు. గురు వారం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాల, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, డ్రగ్, తదితర అంశాల గురిం చి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..సీపీ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూ ల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరి చిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబ డితే వెంటనే పోలీసులకు సమాచారం అందించా లని చెప్పారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి వివరించారు. సైబర్ నేరాల, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి వివరించారు. 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవలు, మహిళలు గృహహింసకు వరకట్నం, శారీ రకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి చెప్పారు. స్నేహిత మహిళా సెంటర్లో నిర్వ హించే కౌన్సిలింగ్ గురించి వివరించారు.

విద్యార్థు లు యొక్క గోల్, అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవ ర్తించాలని అంశాల పై అవగాహనా కల్పించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యా ర్థినిలకు వివరించారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు అవ హేలనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడిం చిన వెంటనే డయల్ 100, సిద్దిపేట షిటీమ్ వాట్స ప్ నెంబర్ 8712667434  స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు కూడా ఓపెన్ చేయొద్దని, ఏదైనా సైబర్ నేరం జరి గితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ ఉపేందర్, ఉపాధ్యాయులు, గజ్వేల్ షీటీమ్ హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి, మహిళ కానిస్టేబుల్ శ్యామల, కానిస్టేబుళ్లు మహేష్, రామ చంద్రారెడ్డి తొగుట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -