డాక్టర్ గోపాలరావు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
నవతెలంగాణ – గోవిందరావుపేట
వర్షాలు విస్తృతంగా కురుస్తున్నందున వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని బర్త్ వేటింగ్ _ హల్, డెలివరీ రూమును, డ్రగ్ స్టోర్ ను, అటెండెన్స్ రిజిస్టర్లను రికార్డులను మరియు రిపోర్టులను పరిశీలించారు. అనంతరం, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చంద్రకాంత్ మరియు సిబ్బందితో మాట్లాడుతూ.. ముంపు గ్రామాలలోని, 15 రోజులలోపు ఉన్న ఈ .డి. డి గర్భిణీ స్త్రీలను వెంటనే సురక్షిత ప్రాంతానికి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని బర్త్ వెయిటింగ్ హలో కైన తరలించాలని అన్నారు.
గ్రామాలలో ఏర్పాటుచేసిన రిహాబిలిటేషన్ సెంటర్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జ్వరాలు ఉన్న గ్రామాలలో ఆంటీ లార్వా కార్యక్రమాలు స్ప్రే, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాముకాటుకు, కుక్క కాటు ఇచ్చే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వర్షాకాల సీజన్ వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధుల నియంత్రణలోని భాగంగా డెంగ్యూ మలేరియా వ్యాధి నిర్ధారణ చేసే ఆర్డిటి కీట్లను , మందులను మరియు ఇతర ఎమర్జెన్సీ మందులను మూడు నెలలకు సరిపోయే విధంగా ఉండేటట్లు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ తల్లి ఆరోగ్యం మరియు పోషణ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీకాంత్ డెమో సంపత్ సూపర్వైజర్ శ్యామల హేమలత స్టాప్ నర్స్ ఆరోగ్య కార్యకర్తలు రాజక్క శకుంతల లలిత మొదలగు వారు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES