Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

- Advertisement -

వైద్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే చేపట్టాలి….
అధికారులను ఆదేశించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

 హైదరాబాదు నుండి  రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు సీతక్క ఉన్నతధికారులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన లతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపద్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలను అందుకు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా వైద్యశాఖ, పంచాయతీ శాఖ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాలలో పర్యటించాలన్నారు.వైద్య అధికారులు ఫీవర్ సర్వే చేపట్టాలని గ్రామపంచాయతీ అధికారులు శానిటేషన్ పై నిరంతరం దృష్టి పెడుతూ పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.

డ్రైనేజీలు శుభ్రపరచాలని, ఖాళీ ప్రదేశాలలో నిలువ ఉన్న నీటిని తక్షణం తొలగించాలని, వీలు కాని ప్రదేశాలలో మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు.

జ్వరాలు రాకుండా దోమ లార్వా పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటిలోనూ వర్షపు నీరుకాని, గ్రామపంచాయతీ సరఫరా చేసిన నీరు కానీ నిలువ ఉంచరాదని, నీరునిలువ చేసుకున్న వాటిపై మూతలు పెట్టి భద్రపరుచుకోవాలన్నారు. డ్రై డే చేపట్టి, కొబ్బరి బోండాలు, పాడైన కూలర్లు, పాత టైర్లు తొలగింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

అపరిశుభ్రత ఉన్నచోట శుభ్రపరుస్తూ బ్లీచింగ్ చల్లించాలని దోమలు ఉన్నచోట ఫాగింగ్ చేపట్టాలన్నారు. మురుగు కాలువలలో దోమలు పెరగకుండా స్ప్రే చేయించాలన్నారు. త్రాగునీటి సరఫరా లో పైపులైన్ల లీకేజీ గుర్తించాలని మరమ్మతులు ఉంటే తక్షణం చేపట్టాలన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను శుభ్రపరచి త్రాగునీటిని క్లోరినేషన్ చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. పనుల వివరాలను ప్రతిరోజు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.

గ్రామపంచాయతీ అధికారులు వర్షాలు కురుస్తున్నందున విష పురుగులు సంచరించకుండా చెత్త చెదారం తొలగింప చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పి. సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -