నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, (బాలికలు) దామెరకుంట పాఠశాలలో జిల్లా ఇంఛార్జి వైద్యాధికారిణి డాక్టర్ శ్రీదేవి, జిల్లా మలేరియా ప్రొగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి ఆదేశానుసారం కాటారం పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జిల్లా ఎకాడమిక్ టీం వైద్య శిభిరం నిర్వహించారు.
పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బాలికలకు, పర్సనల్ హైజిన్, వ్యక్తి గత పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పంచారు. అలానే ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టక ఆహారం తీసుకోవాలనీ, పరిశుభ్రమైన త్రాగునీరు పిల్లలకు అందించాలనీ, వండిన ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలనీ, వర్షాకాలంలో పిల్లలు తినేందుకు వేడి పదార్థాలను ఇవ్వాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం పిల్లలకు యోగ, మెడిటేషన్, ఆటలు తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి, వాష్ రూమ్ లు, శానిటేషన్ ఎల్లప్పుడూ చేసి శుభ్రంగా ఉంచాలని అన్నారు. పరిసరాలలో దోమలు నిలువ ఉండకుండా చూడాలనీ తెలిపారు. అనంతరం డ్రై డే గురించి అవగాహన కల్పించి మేడిపల్లి, దామెరకుంట పాఠశాలలో డ్రై డే నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బయ్యారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ ఎంఎల్ హెచ్ పి ప్రియాంక, గంగారం డాక్టర్ సుమన్, ఆరోగ్య విస్థరణాధికారి స్వామి, జిల్లా ఎకాడమిక్ టీం పరమేశ్వర్, రాజు, రజిత, లక్ష్మి, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాకేష్, విజయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.