Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
సైబర్ నేరాల పట్ల యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు.‌ గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సైబర్ జాగృతి దివాస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, యువత, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, సైబర్ నేరాలను నివారించడమే తమ లక్ష్యం అన్నారు.‌ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్, లోన్ మోసాలు , ప్రకటనల మోసాలు ఆన్‌లైన్ భద్రతల పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతకాలంలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాను పిల్లలు ఎక్కువగా వాడుతున్నారని, వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలన్నారు. కార్యక్రమం ద్వారా నేర్చుకున్న ప్రతిఒక్కరూ మిగతా వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930కి కాల్ చేసి పిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జి హెచ్ఎం రాజలింగం, పోలీసులు యాదగిరి, విజయ్ భాస్కర్, కళ్యాణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -