Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి 

ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలి 

- Advertisement -

రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
జిల్లా కలెక్టరేట్లు అధికారులతో సమీక్ష
నవతెలంగాణ – వనపర్తి  

రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వర్షాలు, వరి ధాన్యం కొనుగోళ్లకి సంబంధించిన అంశంపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజులు వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో మొంతా తుఫాను సంభవించనున్న నేపథ్యంలో దాని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాలపై ఉండే అవకాశం ఉందన్నారు.

కాబట్టి అధికారులు అప్రమత్తమై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. 

   మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఎవరైనా వరి ధాన్యం బయట ఆరబోసుకుంటే, ముందస్తుగా ధాన్యాన్ని కప్పేసుకుని తడవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వర్షం నుంచి ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు పంట కోతలు చేపట్టకుండా వాయిదా వేసుకునేలా సూచించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అదేవిధంగా, ఇప్పటికే పంట కూత చేపట్టిన రైతులు తమ ధాన్యాన్ని తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆరబోసుకునే విధంగా తగు సూచనలు చేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డిఆర్డిఓ ఉమాదేవి, డిఎమ్ఓ స్వరణ్ సింగ్, డి టి ఓ మానస ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -