Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మృతి చెందిన బ్యూటీషియన్‌ను అనూష (26)గా గుర్తించారు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అనూష వృత్తిరీత్యా బ్యూటీషియన్. భర్తతో మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా బీహెచ్ఈఎల్ సమీపంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అనూష ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా, స్పందన రాలేదు.

సోమవారం అనూష ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆమె స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అనూష ఆత్మహత్య చేసుకుందని అతను తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనూష మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad