Monday, October 20, 2025
E-PAPER
Homeసినిమాఅందమైన ప్రేమకథ

అందమైన ప్రేమకథ

- Advertisement -

ఎంజీఆర్‌ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్‌ఎల్‌ఎన్‌ సినీ క్రియేషన్స్‌, ప్రణధి క్రియేషన్స్‌, నవ నారాయణ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కీర్తన నరేష్‌, టీఆర్‌. ప్రసాద్‌ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ హార్ట్‌ టచ్చింగ్‌గా ఉంది. డైలాగ్స్‌ ప్రేమకథలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి. తీరంలో ఓ జంట ప్రేమగా మాట్లాడుకోవడం, విజువల్స్‌, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా ఉన్నాయి.

గ్లింప్స్‌ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది. దర్శకుడు ఎంజీఆర్‌ తుకారాం లవ్లీ ఎమోషన్స్‌, హదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్‌ చెప్పకనే చెప్పింది అని చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎంజీఆర్‌ తుకారాం, నిర్మాతలు: కీర్తన నరేష్‌, ప్రసాద్‌ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప, సంగీతం :నౌఫల్‌ రాజా, డీవోపీ: రుద్రసాయి, ఎడిటర్‌: జెస్విన్‌ ప్రభు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.హిమ బిందు, సాహిత్యం: రెహమాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -