Thursday, September 18, 2025
E-PAPER
Homeసినిమాఅందర్నీ అలరించే 'బ్యూటీ'

అందర్నీ అలరించే ‘బ్యూటీ’

- Advertisement -

ఏ మారుతి టీం ప్రోడక్ట్‌, వానరా సెల్యూలాయిడ్‌, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్‌ పాల్‌ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్‌ కొయ్య, నీలఖి, నరేష్‌, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌.వి.సుబ్రహ్మణ్యం అందించగా, జె.ఎస్‌.ఎస్‌.వర్దన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల19న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌ పాల్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘బ్యూటీ’ టైటిల్‌ ఎంతో క్యాచీగా ఉండటంతో జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో అందమైన ప్రేమ కథతో పాటు మనసుని కదిలించే ఎమోషన్స్‌ ఉంటాయి. ప్రతి మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్‌గా ఎమోషనల్‌ సీన్స్‌ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్‌ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను. ఈ కథ విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్‌ చేయగలిగాం.

రిలీజ్‌ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం. మౌత్‌ టాక్‌ వస్తే తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం. ఈ మూవీని ఇప్పటి వరకు చాలా మంది చూశారు. కొందరైతే ‘బేబీ’, ‘కోర్ట్‌’ స్టైల్లో ఉందని మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే వంద కోట్లు కలెక్ట్‌ చేసే సత్తా ఉన్న చిత్రమిదని ప్రశంసించారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని పొగిడారు. నేను అన్ని రకాల జోనర్‌ చిత్రాలను నిర్మించాలని పరిశ్రమలోకి వచ్చాను. ఇందులో భాగంగా ‘త్రిభాణ ధారి బార్బరిక్‌’ చేశాను. దానికి భిన్నంగా ఈ మూవీని చేశాను. ఇక తీయబోయే సినిమాలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటాయి. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలన్నదే నా లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రేక్షకుల ఆశీర్వాదం పొందుతాననే నమ్మకం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -