– సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – ఆలేరు రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రం కొలనుపాక గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సోమవారం మార్నింగ్ వాక్ లో ప్రజలను కలిశారు.ఈ సందర్భంగా వార్డుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించాలని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పురోగతి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు అవుతున్నాయని అన్నారు. అనంతరం ఏళ్ల నాటి పురాతన చేదబావినీ తప్పుడు సర్వే నంబర్ తో ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొలనుపాకలో మార్నింగ్ వాక్ లో బీర్ల అయిలయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES