Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆటలుఓటమితో ఆరంభం

ఓటమితో ఆరంభం

- Advertisement -

91-84తో జోర్డాన్‌ గెలుపు
ఫిబా ఆసియా కప్‌ 2025
జెద్దా (సౌదీ అరేబియా) :
ఫిబా (ఇంటర్నేషల్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌) ఆసియా కప్‌ 2025ను టీమ్‌ ఇండియా ఓటమితో ఆరంభించింది. సౌదీ అరేబియా రాజధాని జెద్దాలో మంగళవారం ఆసియాకప్‌ పోటీలు ఆరంభం కాగా.. గ్రూప్‌-సిలో జరిగిన తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది. 84-91తో టీమ్‌ ఇండియా ఆఖరు వరకు పోరాడినా.. విజయానికి దూరమైంది. తొలి క్వార్టర్‌లో భారత్‌ 14, జోర్డాన్‌ 18 పాయింట్లు.. రెండో క్వార్టర్‌లో భారత్‌ 24, జోర్డాన్‌ 20 పాయింట్లు సాధించాయి. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి ఇరు జట్లు 38-38తో సమవుజ్జీగా నిలిచాయి. మూడో క్వార్టర్‌లో భారత్‌ 17 పాయింట్లు సాధించగా.. జోర్డాన్‌ 22 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఐదు పాయింట్లు వెనుకంజలో నాల్గో క్వార్టర్స్‌కు వెళ్లిన భారత్‌ 25-20తో అదరగొట్టింది. దీంతో మరోసారి ఇరు జట్లు 80-80తో సమవుజ్జీలుగా నిలిచాయి. అదనపు సమయంలో జోర్డాన్‌ 11 పాయింట్లు సాధించగా.. భారత్‌ 4 పాయింట్లే గెల్చుకుంది. దీంతో ఏడు పాయింట్ల తేడాతో జోర్డాన్‌ పైచేయి సాధించింది. భారత్‌ తరఫున ప్రణవ్‌ ప్రిన్స్‌, అరవింద్‌ ముతుస్వామి రాణించారు. జోర్డాన్‌ ఆటగాళ్లలో అబ్బాస్‌, టక్కర్‌, ఫ్రెడ్డీ మెరిశారు. గ్రూప్‌-సిలో భారత్‌ తర్వాతి మ్యాచుల్లో చైనా, సౌదీ అరేబియాతో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -