నవతెలంగాణ – రాయపోల్
జాతీయస్థాయిలో వైజ్ఞానిక ప్రాజెక్టుల ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జాతీయస్థాయి ప్రశంసా పత్రం అందుకోవడం జరిగిందని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో బేగంపేట విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్తీక, హర్షవర్ధన్, చైతన్య , భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మార్గదర్శనంలో రూపొందించిన వినూత్న ఆవిష్కరణ “స్మార్ట్ వాకింగ్ స్టిక్” అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ -2025 లో జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు.
విద్యార్థులు గత మూడు రోజులు న్యూఢిల్లీలో గల గల్గొటియాస్ యూనివర్సిటీలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అసిస్టెంట్ డైరెక్టర్ అభయ్ జేర్, ఇన్నోవేషన్ డైరెక్టర్ ఎలెన్ గోవన్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించబడ్డాయి. జాతీయస్థాయిలో ప్రశంస పత్రం పొందడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లోని ప్రతిభను, సృజనాత్మకతను దేశవ్యాప్తంగా గుర్తించినదానికి ఇది నిదర్శనం. ఈ సందర్భంగా ప్రశంస పత్రం అందుకున్న బేగంపేట విద్యార్థులకు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పిలు యాదగిరి, స్వామి తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.
జాతీయస్థాయిలో ప్రశంస పత్రం అందుకున్న బేగంపేట విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES