- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థి బెల్లంకొండ జ్యోత్స్న-సరిన్ రావు విజయం ఖాయమైనట్లేని ప్రజలు పురవీధుల్లో చర్చించుకోవడం కనిపిస్తోంది. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి సహకారంతో గ్రామంలో ఉన్న దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు పరిష్కారం చేస్తామనడంతో ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. తాము గెలిసిన వెంటనే గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విధుల్లో ఏల్ఈడి బల్బులు, తాగునీటి తదితర సమస్యలు పరిస్కారం చేస్తామన్నారు. దీంతో ఓటర్లంతా విరివైపే చూస్తున్నారు.
- Advertisement -



