Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeమానవికంటికి మేలు చేసే బీరకాయ

కంటికి మేలు చేసే బీరకాయ

- Advertisement -

బీరకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి ఇది బాగా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడే వాళ్లకి మంచి ఔషధంలా పనిచేస్తుంది. బీరకాయల్లోని విటమిన్‌ బి6 ఎనీమియాను నివారిస్తుంది.
ఇందులోని పెప్టయిడ్లూ ఆల్కలాయిడ్లూ రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బీరకాయలోని విటమిన్‌-ఎ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీనిని ఆరేళ్లపాటు ఆహారంలో భాగంగా చేసుకున్న వాళ్లలో కంటి కండరాల క్షీణత 25 శాతం వరకూ తగ్గిందని పరిశోధనల్లో తేలింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad