Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ గురువులకు అభినందన, ప్రశంస పత్రాలు అందజేత

ఉత్తమ గురువులకు అభినందన, ప్రశంస పత్రాలు అందజేత

- Advertisement -

– శ్రీనివాస రామానుజన్ గణిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గణిత పురస్కారాలు..
నవతెలంగాణ –  కామారెడ్డి

ప్రముఖ విద్యావేత్త, మేధావి  జయప్రకాష్ నారాయణ  చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు  కె సాయిరెడ్డికి  గురు బ్రహ్మ, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రామకృష్ణ కు చుక్కారామయ్య గణిత పురస్కార అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వేదికగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులలో అంతరంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి పోటీ పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టాలనే సదుద్దేశంతో  గత 22  సంవత్సరాలుగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఒలంపియాడ్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.

శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు  తుమ్మ అమరేష్, చుక్కా రామయ్య  మార్గదర్శకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఒలంపియాడ్ పరీక్షలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు.  పాఠశాల స్థాయిలో విద్యార్థులను పరీక్షలు రాయడానికి ఉమ్మడి రాష్ట్రాలలో ప్రోత్సహిస్తున్న ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, క్షేత్రస్థాయిలో విద్యార్థులను ఒలంపియాడ్ పరీక్షలకు సంసిద్ధులుగా చేస్తున్న ఉత్తమ గణిత ఉపాధ్యాయులను ప్రతి ఏటా గుర్తించి వారిని అభినందిస్తున్నారు.

బుధవారం రాత్రి హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వేదికగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విద్యా సంవత్సరానికి గాను కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కే సాయి రెడ్డి ని గురు బ్రహ్మ అవార్డుచే  పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయులు  విజయగిరి రామకృష్ణ కు చుక్కారామయ్య గణిత పురస్కారాన్ని ప్రముఖ విద్యావేత్త  జయప్రకాష్ నారాయణ  చేతుల మీదుగా అందించి అభినందించారు. అర్థమెటిక్, రీజనింగ్లతోపాటు ఒలంపియాడ్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సైతం జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొనేలా సంసిద్ధులుగా చేస్తున్న రామకృష్ణను సంస్థ అధినేత అమరేష్  ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad