ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 302/8
యాషెస్ సిరీస్ చివరి టెస్ట్
సిడ్నీ: యాషెస్ సిరీస్ చివరి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జాకోబ్ బేథెల్ అజేయ శతకంతో మెరిసాడు. డకెట్, బ్రూక్ కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8వికెట్ల నష్టానికి 302పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 2వికెట్ల నష్టానికి 166 పరుగులతో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాకు తొలి సెషన్‌లో నెసెర్(24) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్(138) శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు ఓపెనర్ ట్రివిస్ హెడ్(163) భారీ శతకానికి తోడు లోయర్ ఆర్డర్‌లో వెబ్‌స్టర్(71) అర్ధసెంచరీతో మెరిసాడు. దీంతో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 567పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 265పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది.
ఇంగ్లండ్ బౌలర్లు కర్సే, టంగ్‌కు మూడేసి, స్టోక్స్‌కు రెండు, జాక్స్, బేథెల్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్ క్రాలే(1) నిరాశపరిచినా.. డకెట్(42), బేథెల్(142నాటౌట్) 2వ వికెట్‌కు 81 పరుగులు జతచేశారు. ఆ తర్వాత బ్రూక్, స్మిత్(26) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి బేథెల్‌కి తోడు పోట్స్(0) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు వెబ్‌స్టర్‌కు మూడు, బోలండ్‌కు రెండు, స్టార్క్, నెసెర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-1 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.



