Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రమైన తాడిచర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి,వివిధ విభాగాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలను తెలుసుకున్నారు.రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్య సేవలు గురించి ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్, శానిటేషన్ పరిస్థితులు,రికార్డుల నిర్వహణ, ఓపి రిజిస్టర్ తదితర అంశాలను సమీక్షించారు.ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయానికి హాజరవుతున్నారా? రోగులకు తగిన వైద్యం అందించబడుతుందా అనే అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.  ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటాలని ఆసుపత్రి పరిసరాలు  పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా  తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -