Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమెరుగైన సేవలు సాంకేతికతతో సాధ్యం

మెరుగైన సేవలు సాంకేతికతతో సాధ్యం

- Advertisement -

పలు ఆధునిక కేంద్రాల్ని ప్రారంభించిన ద.మ.రైల్వే జీఎమ్‌ అరుణ్‌కుమార్‌జైన్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు ఆధునిక శాస్త్ర, సాంకేతికత వినియోగంతోనే సాధ్యమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. సోమవారంనాడాయన రైల్‌ నిలయంలో నూతన యూనిఫైడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, జోనల్‌ ఇంటర్‌చేంజ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, స్టేషన్‌ ఇన్ఫర్మేషన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించారు. అలాగే మెట్టుగూడలోని ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్‌లో 198 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆటంకాలు, కార్యాచరణ, అత్యవసర పరిస్థితుల్లో పర్యవేక్షణ, సమన్వయం మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతిక కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. వీటివల్ల రైల్వే భద్రత, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతాయని వివరించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ నీరజ్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు అవార్డుల ప్రదానం
విధినిర్వహణలో సమర్థవంతమైన సేవలు అందించిన ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ‘ఎంప్లారు ఆఫ్‌ ది మంత్‌’ భద్రతా అవార్డులను అందించారు. అలాగే 2022 నుంచి 2025 వరకు దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాలపై ‘గోల్డెన్‌ ఇయర్స్‌ ఆఫ్‌ గ్లోరియస్‌ ఎస్సీఆర్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్‌ డివిజన్ల డివిజనల్‌ రైల్వే మేనేజర్‌లతో (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అవార్డు గ్రహీతల్లో లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకో పైలట్లు, స్టేషన్‌ మాస్టర్లు, ట్రాక్‌ మెయింటెనర్లు, పాయింట్స్‌ మ్యాన్‌లు ఉన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విధుల్ని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad