నవతెలంగాణ-హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నటుడు సోనూసూద్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లకు ఆమోదం తెలిపినందుకు, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ ముగ్గురిని వచ్చేవారం వరుసగా సోమవారం, మంగళవారం, బుధవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల సమయంలో తరచుగా ప్రకటనలు ఇచ్చే 1ఎక్స్ బెట్ యాప్ ద్వారా మనీలాండరింగ్ మరియు పన్ను ఎగవేతపై ఈడి దర్యాప్తు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు శిఖర్ దావర్, సురేష్ రైనా, అలాగే నటి ఊర్వశి రౌతేలా, టిఎంసి మాజీ ఎంపి మిమి చక్రవర్తిలను ఈడి విచారించింది. బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాను కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.