Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్నేడు భారత్ బంద్..దేశవ్యాప్తంగా హై అలర్ట్

నేడు భారత్ బంద్..దేశవ్యాప్తంగా హై అలర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ భారత్ బంద్ కొనసాగనుంది. మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ చేపట్టనున్నట్టు తెలిపింది. దీంతో ఆంధ్ర-ఒడిశా బోర్డర్, ఛత్తీస్ గఢ్ – తెలంగాణ బోర్డర్ భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే ఛాన్స్ ఉండటంతో కూబింగ్ చేపట్టాయి.
ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని పలుగ్రామాల్లో కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అయితే ఇవాళ మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో అంటే ములుగు జిల్లాలో బస్సులు బయటకు రావడంలేదని తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img