Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసివిల్స్‌ విజేతలకు భట్టి అభినందనలు

సివిల్స్‌ విజేతలకు భట్టి అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సివిల్‌ సర్వీసెస్‌లో మెరిసిన 20 మంది తెలంగాణ విజేతలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలన్న లక్ష్యంతో సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారం భించిన రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం లబ్ధిదారులుగా ఉన్న వారిలో 20 మంది తుది ఫలితాల్లో విజేతలుగా నిలవడం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తంచేశారు. సింగరేణి ఉద్యోగి కుమార్తె జి సృజనకు అఖిల భారత స్థాయిలో 55వ ర్యాంకు రావడం శుభపరిణామమని తెలిపారు. యువత ఆకాంక్ష లను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -