నవతెలంగాణ -ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బాధిత రైతు కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను పిఎసిఎస్ చేర్మన్ తీగల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశారు. మండలంలోని తరోడా గ్రామానికి చెందిన దత్తు, బొరిగాం గ్రామానికి చెందిన జాజికర్ బాబు లు పిఎసిఎస్ బ్యాంక్ లో పంట రుణాలను తీసుకున్నారు. అయితే వారు ఇటీవల చనిపోయారు. వారికి రుణం పొందేటప్పుడు రూ. 803 రూపాయలతో ఎల్ఐసి బీమా చేశారు .అయితే వారుఇటీవల చనిపోయారు.ఒక్కొక్క రికి మంజూరైన రూ.2లక్షల రూపాయల చెక్కులను మంగళవారం బాధిత రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో పీఏ సీఎస్ ఛైర్మన్ తీగెల వెంకటేష్ గౌడ్, డైరెక్టర్ సుదర్శన్, అరుగుల లక్ష్మీ,సీఈవో సాయ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ రిచారాణి,సూపర్ వైజర్ సాయి కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి భీమ చెక్కులు పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES