Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ కేలూరులో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ

హెచ్ కేలూరులో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇందిరమ్మ ఇండ్లు నిరుపేద కుటుంబాలకు గూడు నీడ కల్పిస్తుందని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మద్నూర్ మండలంలోని హెచ్ కేలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి విట్టల్ గురూజీ మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్ కాంగ్రెస్ నాయకులు కొండ గంగాధర్ వట్నాల రమేష్ హెచ్కెలూరు మాజీ ఎంపీటీసీ విజయ్ ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు తోట నాగనాథ్ లక్ష్మణ్ ఏక్ నాథ్ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ గ్రామ యువ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -