నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామ శివారులోని శుక్రవారం దేవి అమ్మవారి ఆలయం వద్ద నీటి సౌకర్యం ఏర్పాటు కోసం సోమవారం భూమి పూజ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు, అమ్మవారి పండుగలు చేసే భక్తులు నీటి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులను గమనించిన నాగాపూర్ స్వచ్ఛంద సేవ కమిటీ సభ్యులు ఆలయం వద్ద మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించి భూమి పూజ అనంతరం పనులు ప్రారంభించారు. స్వచ్ఛంద సేవ కమిటీ సభ్యులు ప్రతినెల తాము పోగు చేసుకుంటున్నా నిధులతో ఈ మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టారు.
ఆలయం వద్ద నీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నాగాపూర్ స్వచ్ఛంద సేవ కమిటీ సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ కమిటీ సభ్యులు కంప దండి అశోక్, బట్టు కిషన్, పాలెపు రాజేశ్వర్, బసిరి అశోక్, ఎముగంటి శ్రీనివాస్, రాము, జిల్లా చందు, ఊర్ల నరసయ్య, నీలకంఠం, మహేష్, ధోన్ పల్ గంగాధర్, చిలక దిలీప్, గోవర్ధన్, దిబ్బ శంకర్, రాజేశ్వర్, దుబ్బాక శేఖర్, ఈర్నాల బాబురావు, అచ్చ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
నీటి సౌకర్యం ఏర్పాటు కోసం భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES