Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ భారతితోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ భారతితోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి అన్నారు. గురువారం రోజు మినీ మీటింగ్ హాల్ లో రెవిన్యూ డివిజనల్ అధికారులు, అన్ని మండలాల తాసిల్దార్లతో   రెవెన్యూ సదస్సులో ఎన్ని  దరఖాస్తులు వచ్చాయని వాటిలో ఎన్ని పరిష్కరించారని మండలాల వారిగా సమీక్షిస్తూ  వచ్చిన  దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేసి తద్వారా నోటీసులు జారీ చేయాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, భూ సంబంధిత  సమస్యల మార్పులు చేర్పులు  భూ సమస్యలు పరిష్కరించుట  కొరకు పాత  ధ్రువపత్రాలు అందుబాటులో  ఉంచుకోవాలన్నారు. సంబంధిత   పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగియున్నందున  క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా సకాలంలో  పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈ 

సమావేశంలో భువనగిరి రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, అన్ని మండలాల తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -