Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -

• తొర్రూరు ఆర్డీవో గణేష్ 
నవతెలంగాణ -పెద్దవంగర
భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని తొర్రూరు ఆర్డీవో గణేష్ ఆదేశించారు. మంగళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ మహేందర్, ఇతర సిబ్బందితో కలిసి భూ భారతి దరఖాస్తుల పై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలో సాదా బైనామా దరఖాస్తులు 2451, రెవిన్యూ సదస్సులో 1040 దరఖాస్తు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు ఏదైనా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరణకు గురైతే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. భూ భారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, జీపీవో లు, కార్యలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -