Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి..

భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి..

- Advertisement -

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి..
నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని బాన్సువాడ సబ్  కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ జుక్కల్ మండలంలోని భూభారతి సదస్సులలో దరఖాస్తులు భారీగా వచ్చాయని అన్నారు.  వాటి పరిష్కారం కొరకు విడతల వారీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని జుక్కల్ ఎమ్మర్వో మారుతి  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ తో పాటు తాహసిల్దార్ మారుతి , డిప్యూటీ తాహసిల్దార్ హేమలత , బాన్సువాడ గిర్దావర్ హనుమండ్లు , కంప్యూటర్ ఆపరేటర్ నాగనాథ్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -