శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు: సిఐ రవికుమార్
నవతెలంగాణ – జుక్కల్
బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ ఎం. రవి కుమార్ జుక్కల్ పోలీస్ స్టేషన్ ను శనివారం సాయంత్రం సందర్శించినారు. ఈ సందర్భంగా సందర్శనలో భాగంగా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకూడదు అని జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్స్ అయిన పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన సుబ్రవార్ సాయిలు, అశ్వత్ వార్ వినోద్, అశ్వత్వార్ అరుణ్, వాగ్మారే ఖండే రావు, పడంపల్లి వడ్ల బసవంత్ , కన్నావార్ నాగనాథ్, షేక్ హైదర్ @ దఫేధార్ హైదర్, లకు హెచ్చరిక చేసినారు. వారిపై ప్రతి రోజు పోలీస్ వారి నిఘా ఎప్పుడు ఉంటుంది అని, అలాగే మండలంలో ఎవరైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినచో చట్ట ప్రకారం కఠిన మైన శిక్షలు విధిస్తాం అని తెలిపినారు. ఇట్టి సందర్శనలో జుక్కల్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ కే . నవీన్ చంద్ర మరియు పోలీస్ స్టేషన్ రైటర్ కే. ప్రసాద్ గౌడ్, కే. మోతిలాల్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన బిచ్కుంద సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES