- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వెజరీ జారీ చేశారు. 2025 జూన్ 30 నుంచి 2025 జూలై 2 వరకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మహోత్సవ వేడుకలు జరగనున్నాయని.. ఈ మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. కల్యాణోత్సవం (జూలై 1), రథోత్సవం (జూలై 2) కారణంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర భారీ ట్రాఫిక్ ఉంటుందన్న అంచనాల మేరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు.
- Advertisement -