Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్భారీ ధర పలికిన పెద్దఎడ్గి మున్నూరు కాపు గణేష్ లడ్డు

భారీ ధర పలికిన పెద్దఎడ్గి మున్నూరు కాపు గణేష్ లడ్డు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలోని మున్నూరు కాపు గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డు ధర రూ.151000/- పలికినట్లు మండప నిర్వహకులు మున్నూరు కాపు కుల బాంధవులు  ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గణేష్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా మున్నూరు కాపు గణేష్ మండపంలో ప్రతిష్టించిన గణేశుని విగ్రహం వద్ద ఉన్న లడ్డుకు వేలంపాట నిర్వహించారు. పోటా పోటీగా వేలంపాటలో పాల్గొన్న భక్తులు చివరకు రూ.1,51,000లకు పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన సుంకరివార్ అశోక్  లడ్డును దక్కించుకున్నారు. రెండవ (చిన్న) లడ్డును అపాసివార్ గంగారం రూ. 40 వేలకు కైవసం చేసుకున్నట్లు మున్నూరు కాపు గణేష్ మండలి నిర్వాహకులు పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad