Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్లగుల్లాలు పడుతున్న బడా లీడర్లు

మల్లగుల్లాలు పడుతున్న బడా లీడర్లు

- Advertisement -

– బీసీలకు వరించిన ఎంపీపీ / జడ్పిటిసి రిజర్వేషన్ లు
– అందులో మహిళలకే ప్రాధాన్యత
నవతెలంగాణ – రాయపర్తి
ఎంపీపీ, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో తమ పంతా చూపెట్టాలనుకున్న బడా లీడర్లకు రిజర్వేషన్ లు అనుకూలించకపోవడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం డ్రా పద్ధతి ద్వారా వెళ్లడైన రిజర్వేషన్ లతో ఎన్నికల కోసం ఎదురు చూసిన లీడర్ల కళ్ళలో ఆనందం ఆవిరైపోయింది. రాష్ట్రంలో, నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం విధితమే దాంతో అధికార పార్టీ నుండి ఎంపీపీ, జడ్పిటిసి  ఎన్నికల బరిలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాతోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మండల నాయకులు నంగునూరి అశోక్ కుమార్ తో పాటు మరి కొంతమంది  నాయకులు కూడా  ఆశ జనకంగా ఉన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నుండి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, పార్టీ జిల్లా నాయకుడు పరుపాటు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ, జడ్పిటిసిలు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్ గౌడ్, మరికొంత మంది నాయకులు ఆశించగా ఎంపీపీ, జడ్పిటిసి రిజర్వేషన్ లు బీసీ మహిళలకే రాగా ఆశావాహులకు ఏ ఒక్కరికి ఈ రిజర్వేషన్ వర్తించలేదు. దాంతో వారి స్థానాలను భర్తీ చేసే బిసి మహిళ లీడర్ల  కోసం ఇరు పార్టీలో అన్వేషణ మొదలైంది. మండలంలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -