నవతెలంగాణ-హైదరాబాద్: ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కస్టమర్లు.. తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను 50 వేలు మెయింటేన్ చేయాల్సి ఉంటుందని పేర్కింది. కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే పాత కస్టమర్లకు మాత్రం కనీస బ్యాలెన్స్ 10వేలు మాత్రమే ఉంచింది.
సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న కొత్త కస్టమర్లకు.. కనీస బ్యాలెన్స్ 25వేలుగా ఫిక్స్ చేశారు. గ్రామీణ ప్రాంత కస్టమర్లకు దీన్ని 10వేలుగా నిర్ధారించారు. అయితే రూరల్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పాత కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ 5వేలుగా ఉంది. కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేయని వారు ఆరు శాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
సేవింగ్స్ ఖాతాలో మూడు సార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ కోసం అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రతి ట్రాన్‌జాక్షన్‌కు 150 చెల్లించాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ క్యాష్ విత్‌డ్రాలను నెలకు మూడుసార్లు మాత్రమే చేశారు. సేవింగ్స్ అకౌంట్‌లో థార్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్ ప్రతి ట్రాన్‌జాక్షన్‌కు 25వేలుగా ఫిక్స్ చేశారు.