నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలోని BCA స్టేడియంలో జరగనుంది. ఈ క్రమంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వడదోరలోని బీసీఏ మైదానంలో జరిగిన ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ సుమారు 50 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. అయితే, త్రోడౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన పంత్ వెంటనే నెట్స్ నుంచి వైదొలిగాడు. టీమ్ డాక్టర్ పర్యవేక్షణలో నిర్వహించిన స్కానింగ్ రిపోర్టులలో పక్కటెముకల వద్ద గాయంతో పాటు ‘సైడ్ స్ట్రెయిన్’ ఉన్నట్లు తేలింది. దీంతో అతడు సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని వైద్య బృందం స్పష్టం చేసింది.
భారత్‌కు భారీ షాక్..వన్డే సిరీస్‌కు రిషభ్ పంత్ దూరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



