- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గత సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు మరోసారి పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరికి దేశీయ టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్‌లను 10-12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని చెబుతున్నారు.
- Advertisement -